Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమునా ఎక్స్‌ప్రెస్ హైవైపై మరో నిర్భయ.. మహిళపై అత్యాచారం

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (10:21 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారిపై కదులుతున్న కారులో ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. క్యాబ్ డ్రైవర్, అతని ముగ్గురు స్నేహితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై తక్షణం స్పందించిన పోలీసులు కామాంధులందరినీ అరెస్టు చేశారు. 
 
బుధవారం రాత్రి 8:30 గంటలకు నోయిడా సెక్టార్ 37 నుంచి ఫిరోజాబాద్‌కు ఓ మహిళ క్యాబ్‌ ఎక్కింది. ఇది యమునా ఎక్స్‌ప్రెస్‌వేపైకి వచ్చిన వెంటనే, నిందితులు మహిళను వేధించడం ప్రారంభించారు. అర్థరాత్రి 1 గంటకు ఆగ్రాలోని కుబేర్‌పూర్ ప్రాంతానికి చేరుకుని వాహనాన్ని ఆపారు. ఆ తర్వాత మహిళను పొదల్లోకి తీసుకెళ్లి తెల్లవారుజామున 4 గంటల వరకు అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
నిందితులు ఆ మహిళను ఆటో రిక్షాలో ఎక్కించుకుని ఫిరోజాబాద్‌కు బయలుదేరారు. ఆగ్రాలోని ఎత్మాద్‌పూర్‌లో మహిళ దిగి ఉదయం 7 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన బాధను వివరించింది. మహిళ ఫిర్యాదు మేరకు, పోలీసు బృందం ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు చేరుకుని టోల్ ఫుటేజీని స్వాధీనం చేసుకుంది. దాని ఆధారంగా, పోలీసులు వాహనాన్ని గుర్తించి, మహిళపై అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
 
ఆగ్రా పోలీస్ కమిషనర్ డాక్టర్ ప్రీతీందర్ సింగ్ మాట్లాడుతూ, మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments