Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు బంపర్ ఆఫర్.. ప్రతి నెలా రూ.1000.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (08:10 IST)
వచ్చే యేడాది పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న అమ్ ఆద్మీ పార్టీ  (ఏఏపీ) సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించిన ఫలితాల మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఈ పార్టీ గట్టి పోటీ ఇవ్వనున్నట్టు తేలింది. దీంతో అధికారంలోకి వచ్చేందుకు కేజ్రీవాల్ ఆ రాష్ట్ర మహిళలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. 
 
తాము అధికారంలోకి వస్తే 18 యేళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయలు చొప్పిన నెల నెలా అందిస్తామని ప్రకటించారు. పైగా, కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి రూ.1000 లెక్కన అందజేస్తామని ప్రటించారు. పైగా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికారత కార్యక్రమం అని ఆయన చెప్పుకొచ్చారు. 
 
పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో రెండు రోజుల పాటు పర్యటించారు. ఇందులోభాగంగా, సోమవారం మెగా శిబిరాన్ని ఆప్ ఏర్పాటు చేసింది. ఇందులో అధికార కాంగ్రెస్ పాలకులపై ఆయన విమర్శలు గుప్పించారు. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్‌ను ఫేక్ కేజ్రీవాల్‌గా అభివర్ణించిన ఆయన తాము ఇస్తున్న ఎన్నికల హామీలను కాపీకొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments