Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగమిప్పిస్తానని శారీరకంగా వాడుకున్నాడు.. మాజీ మంత్రిపై మహిళ కేసు

పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన సీనియర్ నేత సూచా సింగ్ లంగాహ్‌ (57)పై రేప్ కేసు నమోదైంది. భర్త చనిపోయిన ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది.

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2017 (09:51 IST)
పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన సీనియర్ నేత సూచా సింగ్ లంగాహ్‌ (57)పై రేప్ కేసు నమోదైంది. భర్త చనిపోయిన ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. భర్త చనిపోయిన తనకు ఉద్యోగమిప్పిస్తానని శారీరకంగా వాడుకుని, ఆర్థికకంగా కూడా మోసం చేశాడంటూ ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనపై పంజాబ్ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
39 ఏళ్ల ప్రభుత్వ మహిళా ఉద్యోగిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను మాజీమంత్రి లంగాహ్‌ను 2009లో కలిశానని అనంతరం యేడాదికే తన భర్త మరణించాడు. ఆ తర్వాత తనకు ఉద్యోగమిప్పిస్తానని చెప్పి తనను శారీరకంగా వాడుకోవడమేకాకుండా తన ఆస్తులను విక్రయించి డబ్బు తీసుకొని మోసం చేశాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
మహిళ ఫిర్యాదు పత్రంతోపాటు అత్యాచారానికి సాక్ష్యంగా మాజీమంత్రి వీడియో క్లిప్‌లున్న పెన్‌డ్రైవ్‌ను పోలీసులకు అందజేసింది. మహిళ ఫిర్యాదుపై తాము జిల్లా అటార్నీ సలహా తీసుకొని మాజీమంత్రిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ అజాద్ దేవిందర్ సింగ్ చెప్పారు. 
 
కాగా, సూచీ రెండు సార్లు ప్రజాపనుల, వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయనపై రేప్ కేసు నమోదు కావడంతో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షపదవికి, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీలకు రాజీనామా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాట్నా వేదికగా "పుష్ప-2" ప్రమోషన్ ఈవెంట్?

నా బరువు గురించి మీకెందుకయ్యా... నెటిజన్‌పై సమంత ఫైర్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments