ఇంద్రాణిని కూడా చితక్కొట్టారంట : కోర్టులో పిటీషన్
						
		
						
				
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాను జైలు అధికారులు చితక్కొడుతున్నారట. ఈమేరకు ఆమె తరపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశా
			
		          
	  
	
		
										
								
																	దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాను జైలు అధికారులు చితక్కొడుతున్నారట. ఈమేరకు ఆమె తరపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
	 
	ఇంద్రాణిని తీవ్రంగా గాయపరిచారని.. ఆమె శరీరంపై మరకలు ఉన్నాయని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. బుధవారం ఇంద్రాణిని కోర్టులో హాజరు పరచాలని జైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. 
	 
	కాగా, రెండు రోజుల క్రితం ఇదే జైలులో జరిగిన భయంకర ఘటన ఒకటి వెలుగుచూసిన విషయం తెల్సిందే. ఓ మహిళా ఖైదీపై మహిళా విభాగాధిపతి మనిషా పోకార్కర్ చేతుల్లో చావుదెబ్బలు తిని ప్రాణాలు విడిచింది. మహిళా ఖైదీని తీవ్రంగా వేధించి.. లైంగిక వేధింపులకు గురి చేశారు. ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ ఆరుగురు జైలు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.