Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ : మార్చి 14 వరకు పాఠశాలలు బంద్

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (14:47 IST)
మహారాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ వింజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలోని పట్టణాలే అధికంగా ఉన్నాయి. పూణెతో పాటు.. నాగ్‌పూర్, అమరావతి తదితర ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.
 
ఈ క్రమంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ప్రభుత్వ పాలకుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్చి 14 దాకా స్కూళ్లు తెరవొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, ఇతర విద్యాసంస్థలన్నీ మార్చి 14 దాకా మూసే ఉంటాయని పూణే మేయర్ మురళీధర్ మోహోల్ ప్రకటించారు.
 
అదేసమయంలో రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అత్యవసరాలు, నిత్యవసరాలు తప్ప వేరే దేనికీ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతినివ్వబోమని మేయర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఫిబ్రవరి 28 వరకు ప్రకటించిన నిబంధనలను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
 
వాస్తవానికి చాలా నెలల పాటు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించిన తర్వాత పూణెలో స్కూళ్లను జనవరిలో తెరిచారు. స్కూళ్లకు వచ్చే ముందు విద్యార్థులు, టీచర్లు విధిగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 
 
ఆ మేరకు జనవరిలో పాఠశాలలు, కాలేజీలను తెరిచారు. కానీ, కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఫిబ్రవరిలో మూసేశారు. ఆ నిబంధనలను ఇప్పుడు పొడిగించారు. కాగా, ఆదివారం ఒక్కరోజే మహారాష్ట్రలో 8,623 కొత్త కేసులు నమోదు కాగా.. పూణెలో వెయ్యికిపైగా రికార్డ్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments