బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన స్కూల్‌లో 138 ఏళ్ల తర్వాత బాలికలకు ఎంట్రీ

స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన పాఠశాలలో 138 యేళ్ళ తర్వాత బాలికలకు ప్రవేశం కల్పించారు. ఈ పాఠశాల మహారాష్ట్రలోని పూణెలోని ఖడ్కీ బజార్‌లో ఉంది. ఈ పాఠశాలను 138 యేళ్ళ క్రితం లోకమాన్య తి

Webdunia
గురువారం, 31 మే 2018 (10:03 IST)
స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన పాఠశాలలో 138 యేళ్ళ తర్వాత బాలికలకు ప్రవేశం కల్పించారు. ఈ పాఠశాల మహారాష్ట్రలోని పూణెలోని ఖడ్కీ బజార్‌లో ఉంది. ఈ పాఠశాలను 138 యేళ్ళ క్రితం లోకమాన్య తిలక్ మరికొంతమంది స్నేహితులు కలిసి ప్రారంభించారు. అప్పటి నుంచి ఎందుకనో ఈ పాఠశాలలో బాలికలు ప్రవేశం కల్పించలేదు. కేవలం బాలురకు మాత్రమే విద్యను చెపుతూ వస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి బాలికలకు తొలిసారి అడ్మిషన్లు కల్పించారు. ఇందులోభాగంగా, ఇప్పటివరకు 25 మంది బాలికలు ప్రవేశం కల్పించినట్టు స్కూలు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో దశాబ్ధాల పురాతన ఆచారాలకు మంగళం పలికినట్టయింది. 
 
ఈ సందర్భంగా స్కూలు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కొన్నిదశాబ్దాలుగా కొనసాగుతున్న లింగ వివక్షకు ముగింపు పలకాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది. ఫలితంగా పాఠశాలలో బాలికల ప్రవేశానికి అనుమతి లభించింది. 1880లో బాలగంగాధర్ తిలక్ ఇతర సంఘసేవకులు గోపాల్ గణేశ్ అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ తదితరులతో కలిసి ఈ పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలను డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments