Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు ముందే యువతిపై ఖాకీల అత్యాచారం..

Webdunia
ఆదివారం, 15 మార్చి 2020 (16:20 IST)
పుదుచ్చేరిలో దారుణం జరిగింది. కొండంత అండగా నిలువాల్సిన పోలీసులే సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ప్రియుడు ముందే ప్రియురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం బయటకురావడంతో ఆ ఖాకీలపై సస్పెండ్ వేటుపడింది. ఈ ఘటన పుదుచ్చేరిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రముఖ పర్యాటక ప్రాంతం పుదుచ్చేరికి ప్రతి వారాంతపు రోజుల్లో ఇక్కడికి ప్రేమజంటలు వాలుతుంటారు. అయితే శుక్రవారం రాత్రి కడలూరుకు చెందిన.. ప్రేమికుల జంటలు అక్కడికి వచ్చాయి. 
 
వారిని గమనించిన బీచ్ బీట్ పోలీసులు... ఆ ప్రేమ జంటల దగ్గరికి వాలిపోయారు. వెంటనే అక్కడ ఉన్న రెండు ప్రేమజంటల దగ్గరికి వెళ్లి.. వారు ఉన్న గదుల వద్దకు వెళ్లి తలుపుతట్టారు.మీ విషయాన్ని మీ ఇంట్లో వారికి చెబుతామని.. మీపై కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బయపడిపోయిన ఓ జంట వారికి లంచంగా రూ.20 వేలు ఇచ్చేశారు.
 
అయితే మరో ప్రేమజంట వద్దకు వాలిన పోలీసులు.. వారిని కూడా బెదిరించసాగారు. అయితే వారి వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఆ ప్రేమ జంటపై అఘాయిత్యానికి దిగారు. ప్రియుడి చూస్తుండగానే.. తన ప్రియురాలిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ విషయాన్ని బయటకి చెప్తే పరువుపోతుందని భయపడ్డారు. 
 
ఆ తర్వాత వారు అక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత పోలీసులు చేసిన ఈ దారుణం వెలుగులోకి రావడంతో.. సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారుల వీరిపై విచారణ చేపట్టింది. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. మామూళ్ల వసూళ్లు చేసిన ఘటనలు రుజువవ్వడంతో ఇద్దరు కానిస్టేబుల్లను సస్పెండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం