Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోదసీలోకి పీఎస్ఎల్‌వీ సీ46.. కౌంట్‌డౌన్ ఆరంభం

Webdunia
మంగళవారం, 21 మే 2019 (13:24 IST)
ఇస్రో సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. తద్వారా మరో అద్భుత ఘట్టానికి తెరతీయనుంది. నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి PSLV-C46 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైంది.


మంగళవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ప్రారంభమైంది. 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన తర్వాత బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు PSLVని నింగిలోకి ప్రయోగించనున్నారు. 
 
615 కిలోల బరువున్న రీశాట్‌-2బీర్‌1 ఉపగ్రహాన్ని రాకెట్‌ అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. అయితే దీని కాలపరిమితి మాత్రం ఐదేళ్లు. PSLV-C46 ప్రయోగాన్ని ముందుగా బుధవారంనాడు ఉదయం 5 గంటల 27 నిమిషాలకు ప్రయోగించాలని నిర్ణయించినప్పటికీ ఆ సమయంలో అంతరిక్షంలో వ్యర్థాలు అడ్డువస్తాయని గుర్తించి 3 నిమిషాల ఆలస్యంగా ఐదున్నర గంటలకు ప్రయోగం చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ప్రస్తుతం కౌంట్‌డౌన్ నిరాటంకంగా కొనసాగుతోంది.
 
ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని, PSLV-C46 నమూనాను శ్రీవారి పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. రేపు ఉదయం ఐదున్నర గంటలకు ప్రయోగం ఉంటుందని శివన్‌ చెప్పారు.

ఆ తదుపరి ప్రాజెక్ట్‌గా జులై 9 నుంచి 16 లోపు చంద్రయాన్‌-2 ప్రయోగించనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్‌ 6న చందమామపై ఇస్రో జెండా రెపరెపలాడుతుందని శివన్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments