Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కూతురు చాలా అందగత్తె... జోలికెళ్తే తాటతీస్తా : స్మృతి ఇరానీ

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (14:47 IST)
తన కుమార్తెను ఆటపట్టించిన ఆకతాయికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటుగా హెచ్చరించారు. తన కుమార్తె చాలా అందంగా ఉంటుందని, ఆమె జోలికెళ్తే మాత్రం తాట తీస్తానంటూ హెచ్చరించింది. పైగా, జోయిష్ ఇరానీకి తల్లినైనందుకు ఎంతో గర్విస్తున్నానని చెప్పుకొచ్చింది. 
 
ఇటీవల స్మృతి ఇరానీ తన కుమార్తె ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ తర్వాత ఆమెకు చేదు ఎదురైంది. ఈ అనుభవాన్ని ఆమె వివరిస్తూ "నిన్న పోస్టు చేసిన నా కుమార్తె ఫోటోను డిలీట్ చేశాను. ఫోటోలో ఆమె అలా చూస్తుండడంపై తన క్లాస్‌లోని ఓ ఇడియట్ ఆమెను ఎగతాళిచేశాడు. తన తల్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఆమె ఎలా చూస్తున్నదో చెప్పాలంటూ తన తోటి విద్యార్ధులను కూడా రెచ్చగొట్టాడు. దీంతో ఆ ఫోటోను చూపిస్తూ తనను ఏడిపిస్తున్నారనీ.. దాన్ని డిలీట్ చేయాలని నా కుమార్తె కోరింది. ఆమె కంటతడి పెట్టడం ఇష్టంలేక నేను అందుకు అంగీకరించాను" అంటూ స్మృతి పేర్కొన్నారు. 
 
అంతేనా, అదే పోస్టులో జోయిష్ ఇరానీ సాధించిన విజయాలను కూడా స్మృతి ఇరానీ వివరించారు. "ఆ ఫోటో డిలీట్ చేయడం వల్ల ఆకతాయికి మరింత బలాన్ని ఇచ్చినట్టవుతుందని తర్వాత నాకు అనిపించింది. కాబట్టి అతడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే... నా కుమార్తె మంచి క్రీడాకారిణి. లిమ్‌కా బుక్స్‌లో కూడా చోటు సంపాదించింది. కరాటేలో సెకండ్ డాన్ బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు కాంస్య పతకం కూడా గెలుచుకుంది. మంచి కూతురు. చాలా అందంగా కూడా ఉంటుంది. మీరు ఎంత ఏడ్పించినా ఆమె తిరిగి పోరాటం చేయగలదు. ఆమె జోయిష్ ఇరానీ. ఆమెకు తల్లినైనందుకు గర్విస్తున్నా" అని స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments