Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెస్ట్‌హౌస్‌లో గుట్టుగా వ్యభిచారం... పది మంది యువతులకు విముక్తి

Webdunia
గురువారం, 1 జులై 2021 (09:44 IST)
ఢిల్లీకి సమీపంలోని నోయిడాలోని ఓ గెస్ట్ హౌస్‌లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు ఛేదించారు. నిందితులు ఎవ‌రికీ అనుమానం రాకుండా నోయిడాలోని సెక్టార్ 51 ప్రాంతంలోని మూడంత‌స్తుల భ‌వ‌నంలోని గెస్ట్‌హౌస్‌లో వ్య‌భిచార దందా నిర్వ‌హిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగి అరెస్టు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నిందితులు గతంలో సెక్టార్ 18లో స్పాను న‌డిపేవార‌ని పోలీసులు పేర్కొన్నారు. సెక్స్ రాకెట్ నిర్వాహ‌కుల‌ను ఆకాష్‌, శివం, ర‌మేష్‌, అభిషేక్‌, యోగేష్‌, ప్ర‌మోద్‌, పూజా నాగ్పాల్‌, మిల‌న్ ఠాకూర్‌లుగా గుర్తించారు. 
 
ఈ ఏడాది ఆరంభంలో స్పాను మూసివేసిన నిందితులు గెస్ట్‌హౌస్‌లో సెక్స్ రాకెట్‌కు తెర‌లేపారు. స్పా పేరుతోనూ వీరు వ్య‌భిచార దందా నిర్వ‌హించిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
స్పాను మూసివేసే క్ర‌మంలో క‌స్ట‌మ‌ర్ల‌కు గెస్ట్‌హౌస్‌లో దందా నిర్వ‌హిస్తున్న‌ట్టు వీరు స‌మాచారం అందించార‌ని పోలీసులు చెప్పారు. దాడుల్లో ప‌దిమంది యువ‌తుల‌ను కాపాడిన పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లం నుంచి మొబైల్ ఫోన్లు, గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ప‌ది మంది క‌స్ట‌మ‌ర్ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం