Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య పుట్టింటికి వెళ్లిందని.. నగ్నచిత్రాలను ఫేస్‌బుక్ పెట్టిన భర్త

Advertiesment
భార్య పుట్టింటికి వెళ్లిందని.. నగ్నచిత్రాలను ఫేస్‌బుక్ పెట్టిన భర్త
, బుధవారం, 16 జూన్ 2021 (13:15 IST)
మానవీయ విలువలు దిగజారుతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. తాజాగా కట్టుకున్న భార్యను కళ్లలో పెట్టుకొని చూసుకోవాల్సిన భర్త నీచానికి ఒడిగట్టాడు. భార్య తనను వదిలేసి వెళ్లిందన్న కోపంతో ఆమె నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ దారుణ ఘటన నోయిడా నగరంలో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. గురుగావ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మహిళ(28)తో 2010 లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిలల్లు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో భార్యాభర్తలు ఇద్దరు నిత్యం గొడవపడుతుండేవారు. 
 
గొడవలో భర్త, భార్యపై చేయిచేసుకొని చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో భర్త వేధింపులను భరించలేని ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక తనను వదిలి వెళ్లిపోయిందనే కోపంతో భార్యపై కక్ష కట్టిన భర్త నీచానికి దిగజారాడు. 
 
ఫేస్‌బుక్‌లో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందులో భార్య నగ్న చిత్రాలను, అశ్లీల చిత్రాలను అవమానకరమైన శీర్షికలతో పోస్టులు చేయడం మొదలు పెట్టాడు. అది గమనించిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా భర్త బాగోతం బయటపడింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు భర్తపై ఐటీ, ఐపీసీ 377,498 ఎ, 506,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెట్‌ల దరఖాస్తుల గడువు పొడిగింపు