Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ పేరుతో వ్యభిచార దందా.. విటులతో ముగ్గురమ్మాయిలు...

దేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగుళూరు నగరంలో హైటెక్ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముఖ్యంగా స్పా మసాజ్ సెంటర్ల పేరుతో ఈ వ్యభిచార దందాను గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తున్నారు. తాజ

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (13:50 IST)
దేశ ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగుళూరు నగరంలో హైటెక్ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముఖ్యంగా స్పా మసాజ్ సెంటర్ల పేరుతో ఈ వ్యభిచార దందాను గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ మసాజ్ సెంటర్‌లో ముగ్గురమ్మాయిలతో విటులు ఎంజాయ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరులోని ఇందిరానగర్‌లోని 13జి మెయిన్ వాణిజ్య భవనంలో వరలక్ష్మీ (45) అనే మహిళ స్పా పేరిట ఓ మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది. తమ సెంటర్‌కు వచ్చే ఖాతాదారులకు మసాజ్ చేసేందుకు పలువురు అందమైన అమ్మాయిలను నియమించింది. 
 
ఈ సెంటర్‌కు వచ్చే ఖాతాదారులు కోరిక మేరకు వారికి అమ్మాయిలను సరఫరా చేస్తుంది. స్పాలో సెక్స్ రాకెట్ సాగుతుందని అందిన సమాచారంతో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేయగా ముగ్గురు అమ్మాయిలు, విటులు చిక్కారు. 
 
ఈ అమ్మాయిల్లో బెంగళూరుకు చెందిన ఓ యువతితోపాటు నాగాలాండ్, అసోంకు చెందిన అమ్మాయిలు ఉన్నారు. వీరిని ప్రభుత్వ మహిళా సదనానికి తరలించారు. వారి నుంచి 3,500 రూపాయల నగదు, సెల్ ఫోన్లు, స్వైపింగ్ మిషన్, విటుల ఫోన్ నంబర్ల జాబితాలు దొరికాయి. పోలీసులు స్పా నిర్వాహకురాలైన వరలక్ష్మీతో పాటు.. పలువురు ఖాతాదారులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం