Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎహే... ఎన్ని షార్లు పీల్షాలీ... జూబ్లిహిల్స్‌లో టీనేజ్ గర్ల్స్ తాగుబోతులు...

హైదరాబాద్ జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్‌లో అర్థరాత్రి దాటేవరకు పబ్బుల్లో డ్యాన్సులు.. ఆ తర్వాత కార్లలో షికార్లు... పీకల దాకా తాగి తూలుతూ కార్లు నడుపుతున్న‌ యువతులు ప‌ట్టుబ‌డ్డారు. జూబ్లీహిల్స్ రోడ్డు నె

Advertiesment
ఎహే... ఎన్ని షార్లు పీల్షాలీ... జూబ్లిహిల్స్‌లో టీనేజ్ గర్ల్స్ తాగుబోతులు...
, శనివారం, 28 జులై 2018 (15:55 IST)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్‌లో అర్థరాత్రి దాటేవరకు పబ్బుల్లో డ్యాన్సులు.. ఆ తర్వాత కార్లలో షికార్లు... పీకల దాకా తాగి తూలుతూ కార్లు నడుపుతున్న‌ యువతులు ప‌ట్టుబ‌డ్డారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 65లో డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన‌ యువతుల మ‌ద్యం మ‌త్తులో హంగామా చేసారు. అంతేకాకుండా... ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా మొండికేసి ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు. 
 
మహిళా కానిస్టేబుల్ లేకుండా తమనెలా పరీక్షిస్తారని అమ్మాయిలు ప్ర‌శ్నించారు. అప్పటికప్పుడు మహిళా పోలీసుల్ని రప్పించి.. తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో డ్రంకన్ డ్రైవ్‌లో టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప‌ట్ట‌బ‌డ్డాడు. కొండాపూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్రావణి తాగిన మత్తులో TS 09 EE 1788 నెంబరు గల కారు నడుపుతూ వస్తుండగా.. ఆమెని బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించారు. శ్రావణికి రక్తంలో ఆల్కహాల్ 49 పాయింట్లు ఉన్నట్టు తేలింది. విశాఖపట్నానికి చెందిన ప్రీతమ్ మెహతా అనే యువతి తాగి AP 28 DX 4860 నెంబరు గల కారు నడుపుతుండగా.. కారుని ఆపి ఆమెకు శ్వాస పరీక్ష చేయగా 43 పాయింట్లుగా మద్యం మోతాదు నమోదైంది.
 
సోమాజిగూడకు చెందిన సర్జిత్ కౌర్ TS 11 EK 5005 నెంబరు గలకారుని ఆపి.. సర్జిత్‌కు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షిస్తే 86 పాయింట్లు వచ్చింది. తమిళనాడుకు చెందిన ప్రొణతినాయర్ TS 13 ED 9724 నెంబరు కారు నడుపుతూ వస్తుండగా.. ఆమెని ఆపి పరీక్షించగా.. ఆల్కహాల్ పర్సంటేజ్ 38 పాయింట్లుగా నమోదైంది. ఢిల్లీకి చెందిన స్నేహ AP 09 CS 2785 నెంబర్ గల కారును తాగి డ్రైవ్ చేయసాగింది. 
webdunia
 
స్నేహను పరీక్షించగా.. 38 పాయింట్ల ఆల్కహాల్ ఆమె బ్లడ్ లో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. పట్టుబడ్డ ఐదుగురు యువతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. యువతుల కార్లను సీజ్ చేసి.. వారిపై కేసులు బుక్ చేశారు పోలీసులు.  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని ఐదు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో 126 మంది పట్టుబడ్డారు. 62 కార్లు, 64 బైకుల్ని సీజ్ చేశారు. వీరిలో ఐదుగురు యువతులున్నారు.  ఇక డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ యువతులకు, మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చాక.. కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భావి భారత ప్రధానమంత్రి బాబా రాందేవ్? ఎవరు చెప్పారు?