Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి పాస్ చేయిస్తానని ఒప్పించి.. బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం..

పదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడిన ఘటన చంఢీగడ్‌లోని సోనిపట్ జిల్లా, గొహనా పట్టణంలో చోటుచేసుకుంది. పదో తరగతి వార్షిక పరీక్షలను వేరొక విద్యార్థితో రాయించి పాస్ చేయిస్తానని నమ్మ

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (09:15 IST)
పదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడిన ఘటన చంఢీగడ్‌లోని సోనిపట్ జిల్లా, గొహనా పట్టణంలో చోటుచేసుకుంది. పదో తరగతి వార్షిక పరీక్షలను వేరొక విద్యార్థితో రాయించి పాస్ చేయిస్తానని నమ్మించి లోబరుచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఇద్దరు మహిళల సాయంతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి చెప్పిన వివరాల్లోకి వెళితే.. తన కుమార్తెను పాస్ చేసేందుకు ప్రిన్సిపాల్‌తో పదివేల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పాడు. 
 
మార్చి 8న ప్రిన్సిపాల్ తనకు ఫోన్ చేసి కుమార్తెతో కలిసి రావాల్సిందిగా కోరారని, అక్కడి వెళ్లాక ఆమె పరీక్షలు రాయాల్సి ఉంటుందన్న ప్రిన్సిపాల్.. తనను వెళ్లమన్నాడని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు. పరీక్ష రాసి ఇంటికి వచ్చిందనుకున్న తన కుమార్తెను కదిలిస్తే.. జరిగిన ఉదంతాన్ని చెప్పిందన్నాడు. ఇద్దరు మహిళలు తనను ఒప్పించి ఆయన గదికి తీసుకెళ్లారని బాలిక చెప్పిందని.. ఈ ఘటనపై బాలిక వాంగ్మూలం అనంతరం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.
 
బాలికను నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టిన స్కూలు ప్రిన్సిపాల్ సహా అతడికి సహకరించిన ఇద్దరు మహిళలపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో వున్న ఈ ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments