Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయ కూల్చివేతను ఎలాగైనా అడ్డుకో బిడ్డా... పూజారి ఆత్మహత్య - సూసైడ్ నోట్

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (11:17 IST)
ఏరియా అభివృద్ధి పేరుతో ఆలయాన్ని కూల్చివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ ఓ పూజారి ఆలయ ప్రాంగణంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. గుడి కూల్చివేతను ఎలాగైనా అడ్డుకో బిడ్డా అంటూ కొడుకుకు ఆత్మహత్య లేఖలో సూచించాడు. ఈ విషాదకర ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర్‍‌లో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. 
 
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుబేర్ నగర్ సంతోషి నగర్‌లో ఓ ఆలయం ఉంది. ఈ గుడిలో మహేంద్ర మినేకర్ అనే వ్యక్తి పూజారిగా వ్యవహరిస్తున్నారు. 9722లో సంతోషి నగర్‌ ఏరియాలో అభివృద్ధిలో అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో మహేంద్ర మినేకర్ తండ్రి ఈ గుడిని కట్టించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఏరియా బాగా అభివృద్ధి చెందింది. 
 
ప్రస్తుతం ఈ ఆలయ స్థలంపై కన్నేసిన కొంతమంది రియల్టర్లు దానిని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మహేంద్ర మినేకర్ కుటుంబం ఆరోపిస్తుంది. కార్పొరేషన్ అధికారులు కూడా బిల్డర్లకే వత్తాసు పలుకుతూ అభివృద్ధి పేరుతో గుడిని కూల్చివేసేందుకు పావులు కదుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన తండ్రి మహేంద్ర మినేకర్ ఉన్నతాధికారులు, బిల్డర్లపై ఒత్తిడి తెచ్చారని, కొంతకాలంగా మానసికంగా వేధిస్తున్నారని బ్రిజేశ్ మినేకర్ చెప్పారు. 
 
ఈ క్రమంలోనే ఆదివారం తన తండ్రి మహేంద్ర మినేకర్ గుడి ఆవరణలో బలవన్మరణానికి పాల్పడ్డారని బోరున విలపించాడు. సూసైడ్ నోట్‌‍లో గుడిని కాపాడాలంటూ తనకు సూచించారంటూ బ్రిజేశ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. కాగా, మహేంద్ర మినేకర్ ఆత్మహత్య విషయంపై కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments