Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిరణ్ అబ్బవరం.. దిల్ రుబా చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

Advertiesment
Kiran Abbavaram, Ruxar Dhillon

దేవీ

, శుక్రవారం, 14 మార్చి 2025 (11:04 IST)
Kiran Abbavaram, Ruxar Dhillon
నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సర్ దిల్లాన్, క్యాథీ డేవిసన్, సత్య, ఆడుకాలమ్ నరేన్, జాన్ విజయ్ తదితరులు.
సాంకేతికత: సినిమాటోగ్రఫి: డేనియల్ విశ్వాస్, మ్యూజిక్: సామ్ సీఎస్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ దర్శకత్వం: విశ్వ కరుణ్ నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ ః
 
కథ:
సిద్దార్థ్ రెడ్డి అలియాస్ సిద్దూ (కిరణ్ అబ్బవరం) చిన్నతనంనుంచి ప్రేమించిన అమ్మాయి మ్యాగీ (క్యాథీ డేవిసన్), అతని తండ్రి చనిపోయాక సిద్దు ప్రవర్తనతో విసుగుచెంది బ్రేకప్ చెప్పి అమెరికా వెళ్ళి పెళ్లిచేసుకుంటుంది. ఎవరైనా మంచి చేసినా థ్యాంక్యూ చెప్పడు. తాను ఎవరికైనా మేలు చేయకపోయినా సారీ చెప్పడు. టిపికల్ మైండ్ సెట్ వున్న సిద్దు, బ్రేకప్ తో ఫ్రస్టేషన్ లో వున్న కొడుకును చూసి తల్లి బెంగుళూరు వెళ్ళమని చెబుతుంది.

అలా వెళ్ళిన సిద్ధుకు చిత్రమైన పరిస్థితిలో అంజలి (రుక్సర్ థిల్లాన్) కలవడం, ఆ తర్వాత సేమ్ కాలేజీ కావడంతో ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతుంది. చివరికి ప్రేమించేటైంకు సిద్దు జీవితంలో ఓ విలన్ ప్రవేశిస్తాడు. దాంతో అంజలి కూడా ఓ సందర్భంలో బ్రేకప్ చెబుతుంది. అమెరికాలో వున్న మ్యాగీ ప్రతి కదలికను తెలుసుకుని సిద్దు లవ్ ను సక్సెస్ చేయిండానికి ఇండియా వస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది సినిమా.
 
సమీక్ష:
’క’ సినిమా సక్సెస్ తో క  కిరణ్ అబ్బవరం అని టైటిల్ లో వేసుకున్నాడు. ఆ సినిమాలో చాలా అమాయకంగా కనిపించే కిరణ్ ఈ సినిమాలో ఆవేశంతోపాటు మెచ్చూర్టీ కలిగిన వ్యక్తిగా నటించాడు. మాజీ ప్రేయసి సిద్దును పలవడం అనేది కొత్త పాయింట్ గా దర్శకుడు అనుకున్నాడు. కానీ కథనంలో నేపథ్యం వేరుగా వున్న ఎగ్జైట్ మెంట్ అంశాలు కనిపించవు.
 
 డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కొత్తగా ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపు అనుభవం ఉన్న దర్శకుడిలా టేకింగ్ ఉంది. కొన్ని చోట్ల భావోద్వేగంతో కూడిన ఎపిసోడ్స్, డైలాగ్స్ సినిమాకు హైలెట్‌గా అనిపిస్తాయి. అయితే ఊహించని మలుపు వుండేలా దర్శకుడు సినిమా తీస్తే మరింత పేరు వచ్చేది. ఎందుకంటే మాజీ ప్రేయసి పాయింట్ చుట్టు అల్లుకొన్న పాయింట్‌లో బలం కనిపించదు. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరింత ఎఫెక్ట్ గా వుంటే బాగుండేది. కాకపోతే కమర్షియల్ అంశాలను ఆధారంగా చేసుకొని పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా మలిచే ప్రయత్నం చేశారు. 
 
నటుడిగా, తనేంటే చూస్తారని చెప్పినట్లుగానే కిరణ్ అబ్బవరం నటన, పెర్ఫార్మెన్స్, ఫైట్స్ బాగా చేశాడు. హీరోయిన్ గా రుక్సర్ ఫుల్ గ్లామర్‌గా నటించింది. ఇప్పటి కాలం పిల్లలా ఆమె బిహేవియర్ వుంటుంది. తండ్రి పెంపకం కూడా అలానే వుంటుంది. క్లాస్ మేట్ గా సత్య కామెడీ అక్కడక్కడా పేలింది. జాన్ విజయ్, నరైన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. " ‘బ్రేకప్‌ తర్వాత లవర్‌ను శత్రువుగా చూడొద్దు..అనే పాయింట్ ను చెప్పదలిగాడు దర్శకుడు. కాలేజీ ప్రిన్సిపాల్ గా సమీర్, లెక్చరర్ గా అమ్రుతం సార్  వాడూ.. నటించారు.
 
సాంకేతికతంగా, సీఎస్ సామ్ మ్యూజిక్, పాటలతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డేనియరల్ విశ్వాస్ విజువల్ పరంగా ఆకట్టుకొంటుంది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాకు రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
సారీ చెప్పడం ఇష్టంలేని వాడిని సారీ చెప్పిండమే కథ. దాని చుట్టూ అల్లుకున్న అంశాలు కథనం. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ పర్వాలేదు. తండ్రి సెంటిమెంట్ బాగుంది. అయితే మాజీ ప్రియుడును కలపడానికి  మ్యాగీ రావడం అనేది బాగున్నా. గర్భవతిగా వుండగా రావడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా కొన్నిచోట్ల చిన్నపాటి లొసుగులున్నా, కథనంలో నెట్టుకొచ్చాడు. లవ్, యాక్షన్ మూవీగా నిలుస్తుంది. 
రేటింగ్: 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరోమారు వాయిదాపడిన 'హరిహర వీరమల్లు'.. ఆ తేదీ ఫిక్స్!