Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

Advertiesment
Kiran Abbavaram, Ruxar Dhillon

డీవీ

, బుధవారం, 12 మార్చి 2025 (17:23 IST)
Kiran Abbavaram, Ruxar Dhillon
కిరణ్ గారు ఈ సినిమాలో చేసిన ఫైట్స్, చెప్పే డైలాగ్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఆయన కోసం నేను ఇంకా మంచి డైలాగ్స్ రాసేందుకు రెడీ. రీసెంట్ గా "దిల్ రూబా" సినిమా చూసి కిరణ్ గారు టెన్షన్ పడకు సినిమా అదిరిపోయింది అన్నారు. అదే నమ్మకంతో చెబుతున్నా ఈ నెల 14న థియేటర్స్ కు వెళ్లండి. ఒక కొత్త కిరణ్ అబ్బవరంను స్క్రీన్ మీద చూస్తారు అని డైరెక్టర్ విశ్వకరుణ్ అన్నారు.
 
కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్.  రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.   ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, నా ప్రతి సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్, డీవోపీ డేనియల్ విశ్వాస్ తప్పకుండా ఉంటారు. వీళ్లు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. "దిల్ రూబా"కు సామ్ సీఎస్ గారు ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఆయన మ్యూజిక్ కోసమైనా మీరు "దిల్ రూబా" చూడాలి.  అయితే ఇప్పుడు మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ నెల 14న కాదు 13 సాయంత్రమే "దిల్ రూబా" ప్రీమియర్స్ తో మా సక్సెస్ జర్నీ స్టార్ట్ కాబోతోంది. హోలీ పండుగను మా మూవీతో కలిసి థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకోండి. సినిమా 2 గంటల 20 నిమిషాల్లో ఎక్కడా బోర్ ఫీల్ కారు. క సినిమాలో కంటెంట్ చూశారు. "దిల్ రూబా"లో కిరణ్ అబ్బవరంను చూస్తారు అని అన్నారు. 

ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ, ఎంతోమంది ఈ సినిమా రిలీజ్ చేస్తామని వచ్చినా మేమే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాం. కిరణ్ గారు మాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. అందరూ సినిమా రిలీజ్ అయ్యాక ఆ రోజు సాయంత్రం సక్సెస్ మీట్ పెడతారు. మేము ఈ నెల 14న మార్నింగ్ షో అయిన వెంటనే సక్సెస్ మీట్ పెట్టబోతున్నాం అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్