Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

Advertiesment
Kiran Abbavaram, Ruxar Dhillon, Cathy Davison, Vishwa Karun, Ravi

దేవి

, శుక్రవారం, 7 మార్చి 2025 (10:21 IST)
Kiran Abbavaram, Ruxar Dhillon, Cathy Davison, Vishwa Karun, Ravi
బ్రేకప్ లవర్ తిరిగి వచ్చి యువకుడి లైఫ్ లో వచ్చి ఏమి చేసిందనే పాయింట్ తో దిల్ రూబా చిత్రం రూపొందిందని ట్రైలర్ లో చూపించారు. కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, క్యాతీ డేవిసన్ హీరో,  హీరోయిన్ లుగా నటించారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. శివమ్ సెల్యులాయిడ్స్,  సారెగమకు చెందిన  ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్గ్భంగా  సినిమా ట్రైలర్ రిలీజ్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ప్రేమ గురించి ఒక కొత్త పాయింట్ ఈ మూవీలో చెప్పాం. లవ్ బ్రేకప్ అయితే లవర్ నుంచి దూరంగా ఉంటాం. శత్రువులా చూస్తాం. కానీ "దిల్ రూబా" చూశాక మీ అభిప్రాయం మారుతుంది. ఇందులో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఒక క్యూట్ ఎమోషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎక్స్ లవర్ ఉంటారు. మీకు వీలైతే ఈ సినిమాను మీ ఎక్స్ లవర్ తో చూడండి. థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఫీలింగ్ తో వస్తారు. మా ప్రొడ్యూసర్ రవి. మూడేళ్లుగా ఈ మూవీని ది బెస్ట్ గా ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. మార్చి 14 రిలీజ్ డేట్. పరీక్షల టైమ్, ఐపీఎల్ ఉంది కాబట్టి మా అందరికీ కాస్త టెన్షన్ ఉంది. అయితే స్టూడెంట్స్ పరీక్షలు బాగా రాయండి, ఆ తర్వాత మా మూవీ చూడండి. మీ అందరికీ మా టీమ్  నుంచి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ హోలీ పండుగను దిల్ రుబాతో మరింతగా సెలబ్రేట్ చేసుకుందాం. "దిల్ రూబా"లో మ్యాజికల్ మూవ్ మెంట్స్ ను థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
 
ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ,  "దిల్ రూబా" సినిమా కంటెంట్ మీరు చూస్తున్నారు ఎంత రిచ్ గా ఉందో. హీరోయిన్స్ ఇద్దరూ మిమ్మల్ని కంటతడి పెట్టిస్తారు. వాళ్ల పర్ ఫార్మెన్స్ అంత బాగుంటుంది. దర్శకుడు విశ్వకరుణ్ కథ నెరేషన్ తో ఆకట్టుకుంటాడు. మాకు ఒక మంచి మూవీ చేశాడు. డీవోపీ డేనియల్, ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్..మ్యూజిక్ చేసిన సామ్ సీఎస్ గారు.ఇలా టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. నా ఫ్రెండ్స్ కొందరు ఈ ప్రాజెక్ట్ కోసం సపోర్ట్ చేశారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా అన్నారు.
 
డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ - "దిల్ రూబా" టీజర్ మీ ఆదరణ పొందింది. ఇప్పుడు ట్రైలర్ కూడా బాగుందని మీరు చెబుతుండటం సంతోషంగా ఉంది. ప్రేమ గొప్పది కాదు అది ఇచ్చే వ్యక్తి గొప్పవాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను. ఈ నెల 14న థియేటర్స్ లోకి వస్తున్నాం. మీ అందరికీ నచ్చేలా మూవీ ఉంటుంది. మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ - "దిల్ రూబా" సినిమాలో అంజలి క్యారెక్టర్ లో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ విశ్వకరుణ్ కు థ్యాంక్స్. ఈ సినిమా చూసే ప్రతి ఆడియెన్ అమ్మాయి అయితే అంజలిగా అనుకుంటారు, అబ్బాయిలు సిద్ధుతో పోల్చుకుంటారు. మా ఇద్దరి క్యారెక్టర్స్ కు అంతగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నా. ఈ మూవీకి హీరో కిరణ్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. మా మూవీ సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి. థియేటర్స్ లో చూస్తే మీరు ఇంకా ఆ పాటల్ని ఇష్టపడతారు. మా ప్రొడ్యూరస్ సారెగమా, శివమ్ సెల్యులాయిడ్స్ వారికి థ్యాంక్స్. ఈ నెల 14న థియేటర్స్ లో "దిల్ రూబా" చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)