Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Advertiesment
kalpana

ఠాగూర్

, శుక్రవారం, 7 మార్చి 2025 (08:59 IST)
అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకుని అపస్మారకస్థితిలోకి వెళ్లిన గాయని కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే, తన భర్తపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఒత్తిడి కారణంగా నిద్రపట్టలేదని, అందుకే మాత్రలు వేసుకున్నట్టు చెప్పారు. 
 
"మీడియాలో మా కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. దాని గురించి అందరికీ వివరణ ఇవ్వాలనుకుంటున్నా. నేను నా భర్త, సంతోషంగా జీవిస్తున్నాం. నేను 45 యేళ్ల వయసులో పీహెచ్‌డీ, ఎల్ఎల్‌బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే ఇవ్వన్నీ చేయగలుగుతున్నా. ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్రపట్టడం లేదు. దానికోసం చికిత్స తీసుకుంటున్నాను. 
 
వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్‌ ప్రకారం కాకుండా ఓవర్ డోస్‌ మాత్రలు తీసుకున్నాను. అందువల్ల స్పృహ తప్పి పడిపోయాను. నా భర్త సరైన సమయంలో స్పందించడం, కాలనీవాసుల, పోలీసుల సహాయం వల్ల నేను మీ ముందు ఉన్నాను. త్వరలోనే మళ్లీ నా పాటలతో మిమ్మలను ఆలరిస్తాను. ఆయన సహాకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నాను. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త. నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ వీడియో విడుదల చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్