మానవ మృగాలపై దయ చూపొద్దు : రాష్ట్రపతి రాంనాథ్

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:27 IST)
ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగాల పట్ల దయ చూపాపాల్సిన అవసరం లేదని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. పైగా, ఇలాంటి వారు క్షమాభిక్షకు అనర్హులనీ, అలాంటివారికి క్షమాభిక్ష ప్రసాదించబోమని స్పష్టం చేశారు. 
 
రాజస్థాన్‌లోని సిరోహిలో జరిగిన బ్రహ్మకుమారీస్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయమని, అత్యాచార కేసుల్లో దోషులకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం కూడా ఉండొద్దని అన్నారు. పోక్సో చట్టం కింద అత్యాచార నిందితులుగా నిర్ధారించబడిన వారికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని, క్షమాభిక్ష పిటిషన్లపై పార్లమెంట్ పున:సమీక్షించాలని సూచించారు.
 
దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రపతి వ్యాఖ్యలతో నిర్భయ నిందితులకు కూడా క్షమాభిక్ష దొరికే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చినట్టైంది.
 
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. ఘటనా స్థలం వద్ద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు ఆయుధాలు లాక్కుని పారిపోయేందుకు యత్నించడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments