Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సిగ్గులేని రాజకీయాలతో దేశానికి ఒరిగేది ఏంటి?: ప్రకాష్ రాజ్ ప్రశ్న

ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చురలంటించిన జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. మరోసారి రాజకీయాలపై నోరు విప్పారు. ఈసారి హిందుత్వం-జాతీయత ఒక్కటేనన

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2017 (16:56 IST)
ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చురలంటించిన జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. మరోసారి రాజకీయాలపై నోరు విప్పారు. ఈసారి హిందుత్వం-జాతీయత ఒక్కటేనని కేంద్ర మంత్రి అనంతకుమార్ హేగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా అనంతకుమార్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. భారత్ లౌకికవాద దేశమని.. ఈ సిగ్గులేని రాజకీయాలతో దేశానికి ఒరిగేది ఏంటని ప్రశ్నించారు.
 
నేషనలిజం, హిందుత్వం ఒక్కటేనని చెప్తున్న కేంద్ర మంత్రి ఆ వ్యాఖ్యలకు అర్థాన్ని వివరిస్తే బాగుంటుందని ట్వీట్ చేశారు అనంతకుమార్ వ్యాఖ్యలను చూస్తే.. ఇస్లాం మతాన్ని ప్రపంచంలోనే లేకుండా చేయాలని భావించేలా ఉందన్న ప్రకాష్ రాజ్... హెగ్డే కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.
 
అటు పిమ్మట అనంతకుమార్ హెగ్డే మాటలపై ప్రకాశ్ రాజ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. హిందుత్వం-జాతీయత ఒక్కటేనని అంటున్నప్పుడు అసలు మతం విషయాన్ని లేవనెత్తటం ఎందుక‌ని నిలదీశారు. అసలు మీ ఏజెండా ఏంటని, పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్‌కు ప్రతీకలా? అని ప్ర‌కాశ్ రాజ్ అడిగారు. డాక్టర్ అంబేద్కర్‌, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, అమృత ప్రీతమ్‌, డాక్టర్‌ కురియన్‌, రెహమాన్‌, కుష్వంత్‌ సింగ్‌ వీరంతా ఎవరు? అని ప్రశ్నించారు.
 
దేశంలో త‌న‌లాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటని ప్ర‌కాశ్‌రాజ్‌ అడిగారు. మాన‌వ‌త్వాన్ని న‌మ్మేవారు దేశానికి చెందిన వాళ్లు కాదా? అని వరుసగా ట్వీట్స్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments