Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (18:23 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని భోపాల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అపార్టుమెంట్ లిఫ్టులో ఎనిమిదేళ్ల బాలుడు చిక్కుకునిపోయాడు. కరెంట్ పోవడంతో లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ చిన్నారి మధ్యలో చిక్కుకునిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి బిడ్డకు ఏమైందోనని తల్లడిల్లిపోయాడు. ఈ క్రమంలో తండ్రికి గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో తీరని శోకం నింపింది. ఈ సంఘటన సోమవారం రాత్రి జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
భోపాల్‌లోని జత్కేడీ ప్రాంతలో ఉన్న ఓ అపార్టుమెంట్‌లో రిషిరాజ్ భట్నాగర్ (51) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులో కలిసి ఉంటున్నారు. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆయన తన ఎనిమిదేళ్ల కుమారుడు కోసం వెతుక్కుంటూ అపార్టుమెంట్ కిందికి దిగాడు. అక్కడ కుమారుడు కనిపించడంతో ఇంటికి వెళ్లమని చెప్పగా, ఆ బాలుడు ఇంటికి వెళ్లేందుకు ఎలివేటర్ ఎక్కగా ఉన్నట్టుండి కరెంట్ పోయింది. దీంతో లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. 
 
తన కుమారుడు లిఫ్టులో ఇరుక్కునిపోయాడని తెలియగానే రిషిరాజ్‌ ఒకింత షాక్‍‌కు గురై, వెంటనే కుప్పకూలిపోయిగా, వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మరోవైపు, విద్యుత్ సరఫరా కేవలం మూడు నిమిషాల్లోనే రావడంతో లిఫ్టులో ఉన్న బాలుడు సురక్షితంగా బయటకు వచ్చాడు. కానీ, కొన్ని నిమిషాల వ్యవధిలో జరగకూడని ఘోరం జరిగిపోయింది. కళ్లముందే కుటుంబ యజమాని కుప్పకూలిపోయి తుదిశ్వాస విడవడం ఆ కుటుంంబంలో తీవ్ర విషాదాన్ని గురిచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments