బహుశా పెళ్లాం చేతుల్లో తన్నులు, లెంపకాయలు తినని వారు వుండరేమోనని ఓ సెలబ్రిటీ ఈమధ్యనే అన్నారు. ఆయన అలా సెలవిచ్చారో లేదో నిదర్శనంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అచ్చం అలాగే అందరికీ దొరికేశారు.
ఇంతకూ అసలు విషయం ఏంటంటే... వియత్నాం పర్యటనలో భాగంగా ఆయన తన సతీమణి బ్రిగ్గెట్‌తో కలిసి వచ్చారు. విమానం రన్ వే పైన ఆగింది. భద్రతా సిబ్బంది విమానం తలుపు తీసారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు లోపల నుంచి బైటకు వచ్చేందుకు సమాయత్తం అవుతుండగా అకస్మాత్తుగా ఆయన చెంపపైన ఆయన భార్య బ్రిగ్గెట్ మెక్రాన్ ఛెళ్లుమనిపించారు. దీంతో బిత్తరపోయిన ఆయన కాస్త లోపలికి వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ విమానం నుంచి కిందికి దిగుతూ వచ్చేసారు. ఆ సమయంలో ఇద్దరూ సఖ్యత లేనట్లుగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.