Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (17:39 IST)
దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపు, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇక మనుగడలోలేని మరో 86 పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. ఢిల్లీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 253 యాక్టివ్‌గా లేని రాజకీయ పార్టీలు ఉన్నట్లు గుర్తించారు. 
 
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు రాసిన లేఖలకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014-19 ఎన్నికల్లో పోటీచేయని రాజకీయపార్టీలను సయితం యాక్టివ్‌గా లేని పార్టీలుగా గుర్తించారు.
 
కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఈ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే రాజకీయ పార్టీలను రిజిష్టర్ చేస్తున్నారు. 
 
కానీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఈసీ ఆరోపించింది.  ఇంకా చాలా రాజకీయ పార్టీలు విధి విధానాలను పాటించడంలేదని ఈసీ గుర్తించింది. అందుకే ఆయా పార్టీలను రద్దు చేసినట్లుగా ఈసీ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments