Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోర్టులో కంటతడి పెచ్చిన బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ

partha chatterjee
, గురువారం, 15 సెప్టెంబరు 2022 (12:03 IST)
బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ కన్నీళ్లు పెట్టుకున్నారు. టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో భాగంగా బుధవారం కోర్టు విచారణ సందర్భంగా కంటతడి పెట్టారు. ''మేము ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నాం'' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. వర్చువల్ పద్ధతిలో వీరిరువురూ కోర్టు విచారణకు హాజరయ్యారు.
 
"ప్రజల్లో నాకున్న ఇమేజ్ విషయం నన్ను కలవర పెడుతోంది. నేను ఎకనామిక్స్ విద్యార్థిని. మంత్రి కాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. నేను రాజకీయ బాధితుడ్ని. ఈడీని మా ఇంటికి రమ్మనండి, నా నియోజకవర్గానికి ఒకసారి వచ్చి చూడమనండి. నేను ఎల్ఎల్‌బీ చేశా. బ్రిటిష్ స్కాలర్‌షిప్ అందుకున్నాం. నా కుమార్తె యూకేలో ఉంటోంది. ఇలాంటి కుంభకోణంలో నేనెందుకు ఉంటాను?'' అని పార్థా చటర్జీ న్యాయమూర్తి ముందు వాపోయారు. 
 
పార్థా ఛటర్జీ బెయిలుకు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెస్తూ, దర్యాప్తు సంస్థకు తన క్లయింట్ సహకరిస్తున్నారని, భవిష్యత్తులో కూడా సహకరిస్తారని చెప్పారు. '' మీరు ఎలాంటి షరతులు విధించినా సరే... దయచేసి నా క్లెయింట్‌కు బెయిల్ మంజూరు చేయండి'' అని కోర్టును అభ్యర్థించారు. 
 
తన నివాసంలో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై తనకెంలాటి ఐడియా లేదని, తాను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు.  
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ, ఏపీల్లో 5 రోజుల్లో భారీ వర్షాలు..