తెలంగాణలో సీజనల్ వ్యాధులు.. పేషెంట్లతో నిండిపోతున్న ఆస్పత్రులు

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (16:25 IST)
తెలంగాణలో సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఇంటింటా విష జ్వరాలు, సీజనల్ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలోనే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 
 
ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా వుంటోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులు నమోదవుతున్నాయి.  ఈసారి తరచూ వానలు పడుతుండటం.. మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం.. అన్నిచోట్ల నీరు నిల్వ వుంచడం, పారిశుద్ధ్య నిర్వహణ లోపం.. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఒక మేడ్చల్ పరిధిలోనే 492 డెంగీ కేసులు వచ్చినట్టు జ్వర సర్వేలో వెల్లడి అయ్యింది.
 
నల్లగొండ జిల్లాలో విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 236 డెంగీ కేసులు వచ్చాయి. సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. 
 
గత ఐదు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు 49.67లక్షల మంది ఔట్ పేషెంట్లు వచ్చారని వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన నివేదిక తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments