#HappyBdayModiji : ప్రధాని నరేంద్ర మోడీ 71వ పుట్టిన రోజు - నేతల విషెస్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (08:52 IST)
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 71వ పుట్టినరోజు వేడుకలను సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు హోం మంత్రి అమిత్ షాలు, ఇతర కేంద్ర మంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గురువారం అర్థరాత్రే ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. 
 
ముఖ్యంగా, కేంద్ర మంత్రులతో సహా ప్రతిపక్ష నాయకులు ట్విట్టర్‌ వేదికగా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మోడీ తన జీవితంలో అనుక్షణం భారతదేశాన్ని బలంగా, సురక్షితంగా, స్వావలంబనగా మార్చడానికి అంకితం చేశారు. ఆయన నాయకత్వంలో దేశానికి సేవ చేయడం నా అదృష్టం. నేడు నేను దేశ ప్రజలందరితో కలిసి ప్రధాని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’  అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. 
 
కాగా, 1950 సెప్టెంబర్ 17వ తేదీన జన్మించిన ప్రధాని మోడీ... 2001-14 మధ్యకాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నాటి సీఎం కేశూభాయి పటేల్ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడీకి అధికార పగ్గాలు లభించాయి. అక్కడ నుంచి ఆయనకు తిరుగులేకుండా పోయింది. 
 
2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాలుగోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.
 
ఆ తర్వాత 2016లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపించి మరోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్సేతర పార్టీలకు చెందిన ఒక పార్టీకి చెందిన నేత వరుసగా ప్రధానమంత్రి కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments