Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే బాయ్ మోడీ... ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆశీర్వదించిన తల్లి...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 67వ పుట్టినరోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. పుట్టిన రోజును పురస్కరించుకుని తన తల్లి ఆశీర్వాదం తీసుకునేందుకు ఆయన గత రాత్రే అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత తన తల్లి

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (09:52 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 67వ పుట్టినరోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. పుట్టిన రోజును పురస్కరించుకుని తన తల్లి ఆశీర్వాదం తీసుకునేందుకు ఆయన గత రాత్రే అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత తన తల్లి హీరాబా వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.
 
కాగా, ప్రధాని మోడీ తల్లి హీరాబా, ప్రస్తుతం మోడీ సోదరుడు పంకజ్‌తో కలసి ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. ఆపై గుజరాత్‌లో నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో స్వయంగా పాల్గొంటారు. అక్కడి నుంచి వడోదరకు వెళ్లి సర్దార్ సరోవర్ ఆనకట్టను జాతికి అంకితం చేసి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 
 
సాధుబెట్ వద్ద వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహ స్థలాన్ని, జరుగుతున్న పనులను పరిశీలించనున్నారని అధికారులు తెలిపారు. అనంతరం దబోయ్ చేరుకుని అక్కడ జరిగే సహకార సమ్మేళనం కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాల్గొంటారు. గత మూడు వారాల వ్యవధిలో మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 
 
మరోవైపు.. మోడీ పుట్టిన రోజు వేడుకలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వైభంగా జరుపుతున్నారు. యూపీలో పెద్దఎత్తున వేడుకలు సాగుతున్నాయి. మోడీ పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో జరిగే పుట్టిన రోజు కార్యక్రమాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ లక్నో విధానసభ ముందు ఏర్పాటు చేసిన 110 అడుగుల భారీ కటౌట్ అందరినీ ఆకర్షిస్తోంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments