Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉ.కొరియా సమీపానికి డోనాల్డ్ ట్రంప్.. కిమ్ జాంగ్ ఉన్ దాడికి తెగబడతాడా?

అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గునమండిపోతోంది. ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ప్రపంచ దేశాలను ధిక్కరించి ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలను నిర్వహి

Advertiesment
Donald Trump
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (17:23 IST)
అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గునమండిపోతోంది. ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ప్రపంచ దేశాలను ధిక్కరించి ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలను నిర్వహిస్తోంది. దీంతో అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు ఉత్తర కొరియాపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తనకు మిత్రదేశంగా ఉన్న దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నవంబరు నెలలో ఉండనుంది. తొలుత జపాన్‌కు వెళ్లే ట్రంప్... ఆ తర్వాత దక్షిణ కొరియాలో అడుగుపెడతారు. ఆ తర్వాత చైనాలో పర్యటిస్తారు. అయితే, దక్షిణ కొరియాకు వెళ్లే ట్రంప్... ఉత్తర కొరియా సరిహద్దుకు కేవలం 35 మైళ్లు... అంటే 56 కిలోమీటర్ల దూరంలో బస చేయనున్నారు. 
 
ఆసమయంలో ఎలాంటి దుస్సాహసానికైనా తెగించే మనస్తత్వం ఉన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఏదైనా చేస్తాడేమోనని దక్షిణ కొరియా సైతం భయపడుతోంది. ట్రంప్ దక్షిణ కొరియాకు వస్తే, కిమ్ ఎలా స్పందిస్తారన్న విషయాన్ని పక్కనుంచితే, ఓ నియంత పాలిస్తున్న దేశానికి అంత దగ్గరగా అమెరికా అధ్యక్షుడు వెళ్లడం మంచిది కాదని అమెరికన్లు సైతం భావిస్తున్నారు.
 
మరోవైపు... ట్రంప్ భద్రత నిమిత్తం మొత్తం అమెరికా ఫెడరల్ యంత్రాంగం వెయ్యి కళ్లతో ఉత్తర కొరియాపై నిఘాను పెట్టనుంది. సరిహద్దుల్లో మిసైల్ డిస్ట్రాయర్ల నుంచి అత్యాధునిక రాడార్లను రంగంలోకి దించనుంది. యూఎస్ అధీనంలోని శాటిలైట్లు ఉత్తర కొరియాను అనుక్షణం కనిపెట్టి ఉండనున్నాయి. ఏ క్షిపణి కదిలినా, సరిహద్దుల్లో తేలికపాటి క్షిపణులు కనిపించినా, వెంటనే ఇవి అప్రమత్తం చేస్తాయి. కిమ్ ఏదైనా చేయాలని చూస్తే చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని యూఎస్ రక్షణ శాఖ అధికారి ఒకరు హెచ్చరించడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంచె ఐలయ్య మళ్లీ కెలికాడు... నల్ల కోమట్లు - తెల్ల కోమట్లు అంటూ...