Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంచె ఐలయ్య మళ్లీ కెలికాడు... నల్ల కోమట్లు - తెల్ల కోమట్లు అంటూ...

కంచె ఐలయ్య తన పుస్తకం 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పైన వివరణలు ఇవ్వడం మానుకునేట్లు లేరు. ఇప్పటికే ఆ పుస్తకంలో తమ కులాన్ని కించపరిచారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అది చాలదన్నట్లు తాజాగా వారిపై మళ్లీ వివాదాస్పద కామెంట్లు చేశారు ఐలయ్య

Advertiesment
కంచె ఐలయ్య మళ్లీ కెలికాడు... నల్ల కోమట్లు - తెల్ల కోమట్లు అంటూ...
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (17:05 IST)
కంచె ఐలయ్య తన పుస్తకం 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పైన వివరణలు ఇవ్వడం మానుకునేట్లు లేరు. ఇప్పటికే ఆ పుస్తకంలో తమ కులాన్ని కించపరిచారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అది చాలదన్నట్లు తాజాగా వారిపై మళ్లీ వివాదాస్పద కామెంట్లు చేశారు ఐలయ్య. నల్ల కోమట్లు ద్రావిడులే.. తెల్ల కోమట్లు ఆర్యులంటూ చెప్పిన ఆయన ఇరాక్ నుంచి వచ్చిన ఆర్యులు ప్రాచీనమైనన హరప్పా, మొహంజోదారో సంస్కృతిని నాశనం చేశారని మండిపడ్డారు.
 
అసలు బ్లాక్ మనీ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసా..  ఆర్యవైశ్య సత్రాల్లోనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాన్ బ్రోకర్ల వ్యాపారం చేస్తున్నవారు ఎవరూ అంటూ ప్రశ్నించిన ఐలయ్య... దేశ సంపదలో 46 శాతం ఆర్యవైశ్యుల చేతిలోనే వుందని పునరుద్ఘాటించారు. వారి వ్యాపారాల్లో భాజపాకు ఇస్తున్న విరాళాలను రైతులకిస్తే ఆత్మహత్యలు వుండవని వ్యాఖ్యానించారు. ఇవన్నీ అంగీకరిస్తే తన పుస్తకాలన్నిటినీ కట్టగట్టి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తగులబెడతానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2030 నాటికి నో పెట్రోల్-డీజిల్ కార్లు... మారుతీ సుజికీ మొదలెట్టింది...