Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను వేయించుకున్నా... ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి.. : ప్రధాని మోడీ

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (12:10 IST)
తాను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాననీ, అలాగే, ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో టీకా వేయించుకున్నారు. ఆయనకు ఎయిమ్స్‌లో పని చేసే పి.నివేదా అనే నర్సు ఈ టీకాను వేసింది. 
 
ఆ తర్వాత ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, ఎయిమ్స్‌లో క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నానని చెప్పారు. క‌రోనాపై పోరాడుతోన్న వైద్యులు, శాస్త్ర‌వేత్త‌ల‌ను ఆయ‌న కొనియాడారు.
 
క‌రోనాను అంత‌మొందించ‌డానికి వారు వేగంగా కృషి చేస్తున్నార‌ని చెప్పారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా వ్యాక్సిన్ ను వేయించుకోవాల‌ని తెలిపారు. అంద‌రం క‌లిసి భార‌త్‌ను క‌రోనా ర‌హిత దేశంగా మార్చుదామ‌ని పిలుపునిచ్చారు. అంద‌రూ వ్యాక్సిన్ తీసుకుని ఈ ల‌క్ష్యాన్ని ఛేదిద్దామ‌ని తెలిపారు.
 
కాగా, మోడీ సోమవారం భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను వేయించుకున్నారు. ఆ సమయంలో ఆయ‌న‌ అసోంలో తయారు చేసిన కండువాను ధరించి క‌న‌ప‌డ్డారు. అసోం, పుదుచ్చేరికి చెందిన రోస‌మ్మ అనిల్‌, పి.నివేద అనే న‌ర్సులు మోడీదీకి వ్యాక్సిన్ వేసే విధి నిర్వ‌ర్తించారు. మోడీకి ఎడ‌మ చేతికి రోస‌మ్మ వ్యాక్సిన్ వేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments