Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌ అశంలో పాక్ ప్రధానికి కౌంటరిచ్చిన ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (14:22 IST)
కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టిగా కౌంటరిచ్చారు. ఉగ్రవాదానికి తావులేని శాంతి, సుస్థిరతకు భారత్ కట్టుబడి వుంటుందని ఆయన తెలిపారు. 
 
పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టారు. ఈయన బాధ్యతలు చేపట్టారో లేదో భారత్‌పై ఒంటికాలిపై లేచారు. వివాదస్పద కాశ్మీర్ అంశం తేలితేనే భారత్‌తో సఖ్యత సాధ్యమవుతుందని ఆయన ప్రకటించారు.  
 
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నవాజ్ షరీఫ్ పార్టీ అధినేతగా ఉన్న షాబాజ్ షరీఫ్ ప్రధాని పీఠమెక్కారు. 
 
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షాబాజ్ షరీప్ మాత్రం మరోలా స్పందించారు. కాశ్మీర్ అంశం పరిష్కారమైతేనే భారత్‌తో సఖ్యత సాధ్యమవుతుందని చెప్పారు. అంతేకాకుండా, ఆర్టికల్ 370 రద్దు, అనేక చర్యల ఫలితంగా కాశ్మీర్‌లో ప్రజలు నెత్తురోడుతున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశం తేలాకే ఇతర అంశాలపై దృష్టిపెడదామంటూ ఆయన తేల్చి చెప్పారు. 

 
అంతకుముందు పాక్ ప్రధాని షాబాజ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఉగ్రవాదానికి తావులేదని పేర్కొంటూ భారత్ శాంతి సుస్థిరతను కోరుకుంటుదన్నారు. "అందుకే మనం అభివృద్ధి సవాళ్ళపైనే దృష్టి నిలిపి, మన ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం పాటుపడదాం" అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments