Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అవార్డులతో దేశం గర్విస్తుంది : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (12:43 IST)
భారత్‌కు రెండు ఆస్కార్ అవార్డులు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ అవార్డులతో భారత్ ఉప్పొంగుతుందని, గర్విస్తుందని ఆయన పేర్కొన్నారు. నాటు నాటు ప్రజాదారణ విశ్వవ్యాప్తం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, 'ఎలిఫెంట్ విస్పరర్స్‌' చిత్రం ద్వారా ప్రకృతితో కలిసి జీవించాల్సిన ప్రాముఖ్యతను చాటి చెప్పారంటూ విస్పరర్స్ యూనిట్‌కు ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"అద్భుతం. నాటు నాటు ప్రజాదారణ విశ్వవ్యాప్తం. ఇది ఎన్నో ఏళ్లు గుర్తిండిపోయే పాట అవుతుంది. ఇంత ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్న ఎంఎం కీరవాణి, చంద్రబోస్, మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు. భారతదేశం ఉప్పొంగింది. గర్విస్తుంది అంటూ ట్వీట్ చేశారు. 
 
అలాగే, మరో ట్వీట్‌లో విస్పరర్స్ బృందాన్ని కొనియాడారు. కార్తీకి, గునీత్ మోంగా, ది ఎలిఫెంట్ విస్పరర్స్‌ బృందం మొత్తానికి నా అభినందనలు. ఈ చిత్రంతో సుస్థిరి అభివృద్ధి, ప్రకృతితో సామరస్యంగా జీవించాల్సిన ప్రాముఖ్యతను అద్భుతంగా హైలెట్ చేశారు" అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments