Ramcharan ET corespondent
ఆర్.ఆర్.ఆర్.లో నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్ళడం తెలిసిందే. ఈనెల12న ఆస్కార్ అవార్డుల ప్రకటన వెలువడనుంది. ఈ సందర్భంగా గురువారంనాడు ఆస్ట్రిలియాకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ నైట్ మీడియా రామ్‌చరణ్‌తో ఇంటర్వ్యూ చేసింది. ఆదివారం రాబోతుంది. అవార్డు ప్రకటిస్తారా!లేదా! అనేదానిపై పూర్తి ఎగైట్‌మెంట్‌తో వున్నాను. ఇంకోవైపు ఇంతదూరం వచ్చినందుకు సంతోషంగా వున్నానంటూ రామ్‌చరణ్ పేర్కొన్నారు.
Ramcharan ET corespondent
ఇక నాటునాటు సాంగ్ షూటింగ్ వివరాలు చెబుతూ, ఇది నా సాంగ్ కాదు. పబ్లిక్ సాంగ్. డిఫరెంట్ ఫీపుల్స్, కల్చర్‌కు బాగా కనెక్ట్ అయింది. జపాన్, యు.ఎస్.లో ఈ పాటను ఆదరిస్తున్నారు. ఈ పాటను ఉక్రెయిన్ పేలస్‌లో తీశాం. ఆ టైంలో అధ్యక్షుడు నటుడు అయిన వ్లాదిమిర్ జలెస్కీకూడా హాజరయ్యారు. ఈ పాటను పాలెస్‌దగ్గరే 7రోజులు రిహార్సల్స్ చేశాం. 200 మంది పీపుల్ వచ్చారు. 17 రోజులు షూటింగ్ చేశాం. 17 సార్లు రీటేక్ అయ్యాయి. నేను, ఎన్.టి.ఆర్. కలిసి ఈక్వెల్‌గా డాన్స్ వేయాలి. ఇద్దరివీ సమానంగా అటూఇటూ రావాలి. ఒక్కోసారి 30 డిగ్రీలు, 40 డిగ్రీలు.. తేడా వుందంటూ రాజమౌళి చెప్పేవారు. ఓ దశలో టార్చెర్‌లా అనిపించింది. అయినా ఆ టార్చర్ చాలా ఆనందంగా వుంది అని పేర్కొన్నారు.
ఆర్ట్‌కు ఎల్లలులేవు. బాష లేదు అని ఆర్.ఆర్.ఆర్. నిరూపించింది. ఇప్పుడు అన్ని ఉడ్‌లు దాటి హాలీవుడ్‌కు చేరింది. ఈ పాటకు సంగీతం సమకూర్చిన 27 ఏళ్ళ కృషిపెట్టిన ఎం.ఎం. కీరవాణిని అభినందించాలి. రాజమౌళి కృషిని వర్ణించలేను అన్నారు.
ఇదే టైంలో మీరు తండ్రి కాబోతున్నారు? అని ప్రశ్నవేయగానే.. అవును. 10 ఏళ్ళుగా బేబీ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్నీ కలిసివచ్చాయని తెలిపారు.