Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ పాటలకు లిప్ సింక్ చేస్తూ పాపులర్.. కిలీ, నీమాలకు ప్రధాని కితాబు

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:29 IST)
Modi
భారతీయ పాటలకు లిప్ సింక్ చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాంజానియా సోషల్ మీడియా సెలెబ్రిటీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతీయ పాటలకు లిప్ సింక్ చేసే కిలీ, నీమా అనే టాంజానియా సోషల్ మీడియా సెలెబ్రిటీల ప్రయత్నాలను మోదీ ఆదివారం తన మన్ కీ బాత్ ప్రసంగంలో అభినందించారు. 
 
ఈరోజు నెలవారీ రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 86వ ఎపిసోడ్‌ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, “మిత్రులారా, భారతీయ సంస్కృతి, మన వారసత్వం గురించి మాట్లాడుతూ, భారతీయ సంగీత మాయాజాలం అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇంకా నేను మన్ కీ బాత్‌లో మీకు ఇద్దరు వ్యక్తులను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇద్దరు టాంజానియన్ తోబుట్టువులు, కిలీ పాల్, అతని సోదరి నిమా, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చాలా వార్తల్లో ఉన్నారు. మీరు కూడా వారి గురించి తప్పక విని ఉంటారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. టాంజానియాలోని భారత రాయబార కార్యాలయంలో కూడా కిలీ పాల్‌కు సన్మానం జరిగినట్లు ప్రధాని పేర్కొన్నారు. 
 
ఇకపోతే.. కిలీ, నీమాలు భారతీయ సంగీతం పట్ల అభిరుచి కారణంగా వారు బాగా ప్రాచుర్యం పొందారు. భారతీయ పాటలకు లిప్ సింక్ చేస్తూ వీరిద్దరూ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా రిపబ్లిక్ డే సందర్భంగా వీరు మన జాతీయ గీతం జన గణ మన పాడిన వీడియో వైరల్‌గా మారింది. ఇకపోతే.. ఇటీవల మరణించిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌కు కూడా ప్రధాని నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments