Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం-కిసాన్ పథకం.. ఈ-కేవైసీ ఆప్షన్‌ పునరుద్ధరణ

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (13:55 IST)
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకంలో ఈ-కేవైసీ ఆప్షన్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పినట్లైంది. 
 
రైతులకు ఈ పథకంలో భాగంగా ఏటా 3 దఫాల్లో రూ.6 వేలను వారి ఖాతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. 11వ విడతలో భాగంగా పథకం సాయం పొందేందుకు గతంలో ఈ-కేవైసీ తప్పనిసరి అని చెప్పింది. ఆ తర్వాత ఈ-కేవైసీని తాత్కాలికంగా రద్దు చేసింది. 
 
ప్రస్తుతం తిరిగి పునరుద్ధరించింది. ఇందులో భాగంగా పథకం నుంచి ప్రయోజనం పొందే రైతులు మే 31, 2022లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. 
 
ఈ-కేవైసీని పూర్తి చేసేందుకు రైతులు సీఎస్‌సీ(కామన్ సర్వీసు సెంటర్ల)కు వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. 
 
ఆ తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తవుతుంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కేంద్రం సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments