Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌కీల్ సాబ్ వ‌స్తున్నాడు... జ‌న సేన రారండోయ్ !

Webdunia
సోమవారం, 5 జులై 2021 (15:19 IST)
బీజేపీతో మిలాఖ‌త్ అయిన త‌ర్వాత‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బొత్తిగా అమ‌రావ‌తికి రావడం మానేశారు. వ‌కీల్ సాబ్ షూటింగుల్లో, ఇత‌ర‌త్రా ప‌నుల్లో బిజీగా ఉన్నార‌నేది ఆయ‌న ఆంత‌రంగీకుల స‌మాచారం. విజ‌య‌వాడ‌-గుంటూరుల మ‌ధ్య మంగ‌ళగిరిలో జ‌న‌సేన రాష్ట్ర కార్యాల‌యంలో ప‌వ‌న్ సాబ్ మీటింగ్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. మ‌ధ్య‌లో క‌రోనా రెండు వేవ్ కూడా వ‌చ్చిపోయింది. 
 
ఆయ‌న ఎప్పుడు వ‌స్తారో అని జ‌న సైనికులు ఆశ‌గా ఎదురుచూపులు చూస్తున్నారు. ఇపుడు మ‌న వ‌కీల్ సాబ్ వ‌చ్చేస్తున్నాడోచ్....అని స‌మాచారం అందింది. కేడ‌ర్ అంతా కార్యాల‌యానికి వ‌చ్చేయాల‌ని పిలుపు వ‌చ్చింది. 
ఈ నెల 6న విజయవాడ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ‌స్తున్నార‌ని ఆ పార్టీ ముఖ్య నాయ‌కుడు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు ఉప్పు అందించారు. ఈ నెల 7న మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు జనసేనాని. 
 
ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై జ‌న‌సేన అధినేత చర్చించనున్నార‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నార‌ని వివ‌రించారు. పార్టీకి సంబంధించిన పలువురు నేతలతో ప‌వ‌న్ సమావేశం అవుతార‌న్నారు. 
 
అయితే, బీజేపీతో క‌లిశాక‌, ప‌వ‌ర్ స్టార్ ద‌ర్శ‌న‌మే క‌రువైంద‌ని పార్టీ క్యాడ‌ర్ వాపోతోంది. జ‌న‌సేన ఇంత‌కు ముందు సొంతంగా కార్య‌క్ర‌మాలు చేసేద‌ని, బీజేపీతో క‌లిశాక అవి కూడా ప‌ల‌చ‌బ‌డిపోయాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈసారి కోవిడ్ సెంకండ్ వేవ్ త‌ర్వాత, ఫ్రెష్‌గా వ‌స్తున్న జ‌న‌సేనాని... జ‌న‌సైనికుల్లో ఎలాంటి న‌వ్యోత్సాహాన్ని నింపుతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments