బిలాస్‌పూర్ రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టడంతో కనీసం ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారని అధికారులు మంగళవారం సాయంత్రం తెలిపారు. బిలాస్‌పూర్ స్టేషన్ సమీపంలో సాయంత్రం నాలుగు గంటలకు మెము రైలు వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
గూడ్స్ రైలులోని చివరి బోగీని ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ప్యాసింజరు రైలు మొదటి బోగీ గూడ్స్ రైలు పైకి దూసుకెళ్లింది. కాగా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన ప్రయాణీకులకు రూ. 1 లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.