Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ క్యాంటీన్‌లో చేదుగా మారిన హైదరాబాద్ బిర్యానీ!!

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (13:01 IST)
మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులకు హైదరాబాద్ బిర్యానీ అంటే పడిచచ్చిపోతారు. ఈ బిర్యానీకి అంతటి ప్రాముఖ్యత, ప్రాచూర్యం ఉంది. అందుకే భారత్‌కు ఇతర దేశాల అధ్యక్షుడు వచ్చినట్టు ఖచ్చితంగా హైదరాబాద్ బిర్యానీ ఓ డిష్‌గా ఉంటుంది. అలాంటి హైదరాబాద్ బిర్యానీ ఇపుడు పార్లమెంట్ క్యాంటీన్‌లో చేదుగా మారనుంది. అంటే.. ఈ బిర్యానీ ధరను పెంచేశారు. 
 
త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే, పార్లమెంట్ క్యాంటీన్ సబ్సీడీ ధరలకే అన్ని రకాల ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభిస్తుంటాయి. ఇపుడు ఈ సబ్సీడీని ఎత్తివేశారు. స‌బ్సిడీ ఎత్తేసిన త‌ర్వాత కొత్త ధ‌ర‌లతో మెనూ ఏర్పాటు చేశారు. రాబోయే బ‌డ్జెట్ సెష‌న్‌లో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను ఎంపీల‌కు వ‌డ్డించ‌డానికి సిద్ధం చేస్తున్నారు. 
 
అయితే వీటికి కొత్త ధ‌ర‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు నాన్‌వెజ్ బ‌ఫే కోసం ఎంపీలు రూ.700 చెల్లించాల్సిందే. మెనూలో అత్య‌ధిక ధ‌ర ఉన్నది ఇదే. ఇక అతి త‌క్కువగా ఒక చ‌పాతీ ధ‌రను రూ.3గా నిర్ణ‌యించారు. ఇన్నాళ్లూ పార్ల‌మెంట్ క్యాంటీన్‌లో హైద‌రాబాద్ మ‌ట‌న్ బిర్యానీ రూ.65కే ఇచ్చేవాళ్లు. ఇప్పుడు దాని ధ‌ర రూ.150కి చేరింది. 
 
ఈ పెరిగిన ధ‌ర‌లు జ‌న‌వ‌రి 29 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. అదే రోజు పార్ల‌మెంట్ బ‌డ్జెట్ సెష‌న్ ప్రారంభంకాబోతున్న విష‌యం తెలిసిందే. కొత్త ధ‌ర‌ల ప్ర‌కారం శాకాహార భోజనానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఇక గ‌తంలో రూ.12గా ఉన్న ఉడ‌క‌బెట్టిన కూర‌గాయ‌ల ధ‌ర‌ను రూ.50కి పెంచారు. త్వ‌ర‌లోనే పార్ల‌మెంట్ క్యాంటీన్‌లో స‌బ్సిడీని ఎత్తేస్తున్న‌ట్లు జ‌న‌వ‌రి మొద‌ట్లోనే స్పీక‌ర్ ఓం బిర్లా చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ స‌బ్సిడీని ఎత్తేయ‌డం వ‌ల్ల లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్‌కు ఏడాదికి రూ.8 కోట్లు మిగ‌ల‌నుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అత్తారింటికి దారేది చిత్రంలో అత్త లాంటి పాత్రలు చేస్తా: మాజీమంత్రి రోజా

సీరియస్ పాయింట్ సిల్లీగా చెప్పిన మెకానిక్ రాకీ -రివ్యూ

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments