Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ ధర తొలిసారిగా రూ.100 మార్కును తాకింది.. దేశ చరిత్రలోనే..?

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (12:52 IST)
భారత దేశ చరిత్రలో పెట్రోలు ధర తొలిసారిగా రూ. 100 మార్క్‌ను తాకింది. గురువారం రాజస్థాన్‌లో బ్రాండెడ్ పెట్రోల్ ధర సెంచరీని అధిగమించింది. గురువారం చమురు సంస్థలు పెట్రోలు ధరను 25 పైసల మేరకు పెంచడంతో, ఆ మేరకు దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయి. దీంతో రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బ్రాండెడ్ పెట్రోలు ధర సరిగ్గా రూ. 101.15ను తాకింది. ఇక సాధారణ పెట్రోలు ధర దేశవ్యాప్తంగా రూ. 95 నుంచి రూ.89 మధ్య కొనసాగుతున్నాయి. 
 
ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 86.30గా ఉండగా, ముంబైలో రూ. 92.86కు చేరుకుంది. పెట్రోలు ధరలపై విలువ ఆధారిత పన్నులను వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సర్వత్రా విజ్ఞాపనలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీగంగానగర్ లో సాధారణ పెట్రోలు ధర రూ. 98.40 ఉండగా, ప్రీమియం ధర రూ. 101.15కు చేరుకుంది. ప్రీమియం పెట్రోల్ లో కాలుష్య కారకమైన ఆక్టేన్ పరిమాణం తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments