Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్ - వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి!

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (08:54 IST)
తమకు దూరమైన తమ కుమారుడి జ్ఞాపకాలను పదిలంగా ఉంచేందుకు ఓ తండ్రి వినూత్నంగా ఆలోచన చేశాడు. కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశాడు. తన కుమారుడి సమాధిని చూసిన వారికి కేవలం పేరు మాత్రమే కాకుండా అతని జీవిత వివరాలు కూడా తెలియాలన్న ఏకైక ఉద్దేశ్యంతో ఇలా ఏర్పాటుచేశాడు. తద్వారా తన కుమారుడి ఆదర్శ జీవితం అందరికీ తెలియాలన్న ఉద్దేశ్యంతో ఆ తండ్రి ఇలా చేశారు. ఈ ఆసక్తికర సంఘటన కేరళ రాష్ట్రంలోని త్రిశూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్‌కు సంగీతంలోనూ, క్రీడల్లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. ఈయన గత 2021లో బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించాడు. కురియాచిరలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుమారుడు ఆదర్శ జీవితం గడపడంతో అతడి జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలని భావించిన తండ్రి ఫ్రాన్సిస్... ఇవిన్ సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి దాన్ని తమ కుమారుడు పూర్తి వివరాలు ఉన్న వెబ్‌సైట్‌తో అనుసంధానం చేశారు. 
 
ఇవన్ జీవించి వున్నపుడు వివరాలన్నింటినీ క్యూఆర్ కోడ్ రూపంలో భద్రపరిచి ఉండేవారని, ఇపుడు అతడి విషయంలోనూ ఇదే చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తన కుమారుడి సమాధాని సందర్శించిన వారికి అతని కేవలం పేరు, జనన మరణ తేదీలు మాత్రమే కాకుండా, అతను జీవిత వివరాలను తెలియాలన్న ఉద్దేశంతోనే ఇలా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపాడు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments