Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువుకు కన్యత్వ పరీక్ష - టెస్టులో విఫలమైందంటూ కట్నం డిమాండ్

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (21:40 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో సభ్యసమాజం తలదించుకునే హేయమైన ఘటన చోటుచేసుకుంది. 24 యేళ్ళ నవ వధువుకు పెళ్లయిన తొలి రోజే కన్యత్వ పరీక్షను అత్తమామలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆ వధువు విఫలం కావడంతో రూ.10 లక్షల కట్నం డిమాండ్ చేశారు. దీంతో ఆ వధువు పోలీసులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని భిల్వారాలో మే 11వ తేదీన ఓ యువతికి వివాహం జరిగింది. అదే రోజు రాత్రి కన్యత్వ పరీక్ష నిర్వహించారని ఆ యువతి తాజాగా ఆరోపించింది. తాను ఆ పరీక్షలో విఫలం కావడంతో భర్త, అత్తమామలు తనపై దాడి చేశారని వాపోయింది. మే 31 స్థానిక ఆలయంలో కుల పంచాయతీ జరిపి తాను శీలవతిని కాదని ముద్ర వేశారని, రూ.10 లక్షలు గ్రామ పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చారు. 
 
ఈ యువతికి పెళ్లికి ముందే పక్కింటి వ్యక్తి చేతిలో అత్యాచారనికి గురైందని, ఈ విషయం తెలుసుకున్న అత్తమామలు ఈ కన్యత్వ పరీక్షలు నిర్వహించాలని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుభాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం