లైగర్ సినిమా కలెక్షన్ల పరంగా రాణించలేకపోయింది. దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమాను దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని చెపుతున్నారు. దీంతో, కలెక్షన్ల పరంగా చూస్తే ఈ సినిమా భారీ నష్టాలనే మిగిల్చినట్టయింది.
మరోవైపు ఈ సినిమాలో నటించిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్‌కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారట. టైసన్ ఏకంగా రూ.23 కోట్లు తీసుకున్నాడని ఓ వార్త వైరల్ అవుతోంది. అంటే మొత్తం పెట్టుబడిలో టైసన్ ఖర్చే ఎక్కువని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
ఇకపోతే.. తాజాగా నటి శ్రీరెడ్డి లైగర్ సినిమాపై స్పందించింది. ఈ సినిమాలో అసలు కంటెంటే లేదని... కంటెంట్ లేని సినిమాకు ఇంత హైప్ అవసరమా? అని ఎద్దేవా చేసింది.
అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై శ్రీరెడ్డి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీసేవన్నీ ఫ్లాప్ సినిమాలేనని... అయినా, మహేశ్ బాబు డేట్స్ ఇవ్వడం లేదని చెప్పడం ఏంటో అని విమర్శించింది. మహేశ్ డేట్స్ ఇవ్వలేదని ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.