Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతమంది అమ్మాయిలను చూసేసరికి కుర్రోడు కళ్లుతిరిగిపడిపోయాడు..

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (16:36 IST)
బీహార్‌లో విచిత్ర ఘటన జరిగింది. పరీక్షా హాలుకు వెళ్లిన ఓ కుర్రుడు.. అక్కడ ఉన్న అమ్మాయిలను చూసేసరికి కళ్లు తిరిగిపడిపోయాడు. పరీక్షా రాస్తున్నాననే భయం కంటే 500 మంది అమ్మాయిల మధ్య తాను ఒక్కడినే ఉన్నానన్న భయం వెంటాడింది. ఫలితంగా ఆ కుర్రోడు స్పృహతప్పి పడిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలన పరిశీలిస్తే, బీహార్‌లో 12వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మనీశ్ శంకర్ ప్రసాద్ (17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజీ విద్యార్థి. తొలి పరీక్ష గణితం రాసేందుకు పరీక్షా హాలుకు వెళ్లాడు. పరీక్ష రాసేందుకు హాల్లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి ఆశ్చర్యపోయాడు. పైగా, అతన్ని చూసిన అమ్మాయిలంతా ఒక్కసారిగా ఘొల్లుమంటూ నవ్వేశారు. దీంతో అర్థంకాని అయోమయంలో ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయాడు. పైగా, అప్పటికపుడు జ్వరం కాసింది. దీంతో పక్కనే ఉన్న సర్దార్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
 
దీనిపై ఆ కుర్రోడి మేనత్త స్పందిస్తూ.. "ఒకేసారి అంతమంది అమ్మాయిలను చూసి చాలా కంగారుపడ్డాడు. అందుకే స్పృహతప్పి పడిపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యంగానే ఉన్నాడని, అతని బాగోగులు చూసుకుంటున్న చెప్పారు. పూర్తిగా అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన ఈ పరీక్షా సెంటరులో పొరపాటున మనీష్‌కు కూడా అధికారులు కేటాయించారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments