తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎల్లారెడ్డి పేటలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. కొందరు విద్యార్థులతో వెళుతున్న స్కూలు బస్సును ఆర్టీసీ బస్సు ఒకటి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది చిన్నారులు గాయాలయ్యాయి.
ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందిచారు. ప్రమాదానికి గల కారణాలను జిల్లా డీఈవోను అడిగి తెలుసుకున్నారు. అలాగే, గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు, ఈ ప్రమాదంపై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో ఫోనులో మాట్లాడి విద్యార్థుల క్షేమ సమచారం అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్ నగరానికి తరలించి చికిత్స అందేలా చూడాలని కోరారు.