Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి కొరత : నాసిక్ జిల్లాలో వేలం నిలిపివేత

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:59 IST)
దేశంలో ఉల్లి కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో దీని ఎగుమతులపై 40 శాతం పన్ను విధించింది. దీన్ని వ్యాపారులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉల్లి మార్కెట్లలో వేలం నిలిపివేశారు. ఈ జిల్లాలోని లాసల్‌గావ్ మార్కెట్ భారతదేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్.
 
కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చల నేపథ్యంలో ఉల్లి వ్యాపారులు సమ్మెను వాయిదా వేశారు. ఈ పరిస్థితిలో తమ డిమాండ్ ఇంతవరకు నెరవేరలేదని నిరసిస్తూ నిన్నగాక మొన్న నాసిక్ జిల్లా మార్కెట్లలో ఉల్లి వేలాన్ని మళ్లీ నిలిపివేశారు. ఈ నిరసన గురువారం రెండో రోజు కొనసాగింది. దీంతో రైతులు వేలానికి తెచ్చిన ఉల్లి బస్తాలు మార్కెట్లలోనే ఉండిపోయాయి.
 
వ్యాపారుల సమ్మె కారణంగా ఉల్లి సరఫరా నిలిచిపోయి చిల్లర దుకాణాల్లో ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నాసిక్‌లోని సహకార సంఘాల రిజిస్ట్రార్ అన్ని వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీలకు (ఏపీఎంసీ) ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మెలో పాల్గొన్న వ్యాపారుల లైసెన్సులు రద్దు చేస్తామని, లేదంటే సస్పెండ్ చేస్తామని అందులో హెచ్చరించారు. 
 
ఈ విషయమై నాసిక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. 20వ తేదీన జరిగిన చర్చల్లో వ్యాపారులు, దళారులు మొండిచేయి చూపారని, దీని వల్ల తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments