టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో.. ఇక టమోటా ధరలకు ఉల్లి ధరల పెంపు కూడా తోడు కానుంది. ఆగస్టు, సెప్టెంబరు వర్షపాతంపై ఉల్లి ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ నెలాఖరుకు ఉల్లి ధర కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ పేర్కొంది.
రబీ ఉల్లి నిల్వ ప్రకారం 1-2 నెలలు తగ్గినట్లు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ తెలిపింది. సరఫరా-డిమాండ్ మధ్య అసమతౌల్యం ఉందని, ఇది ఆగస్టు నాటికి కనిపించవచ్చని తెలిపింది.
ఫలితంగా సెప్టెంబరు నాటికి ధరలు పెరగొచ్చని అంచనా వేసింది. ఖరీఫ్‌లో దిగుబడులు పెరిగితే ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని క్రిసిల్ వెల్లడించింది.