Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (11:48 IST)
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు కొనసాగుతున్నది. మంగళవారం చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 28 పైసల వరకు పెంచాయి. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి పెరిగాయి.

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.50, డీజిల్‌ రూ.88.23కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్‌ రూ.103.63కు చేరింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్‌, లద్దాఖ్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను ధాటింది.
 
దేశంలో అత్యధికంగా పాక్‌కు సమీపంలో ఉన్న రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ఫిబ్రవరిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. ఈ నెల ప్రారంభంలో డీజిల్‌ సైతం రూ.100 మార్క్‌ను చేరింది.

దేశంలోనే అత్యధికంగా ప్రస్తుతం రూ.108.37, డీజిల్‌ రూ.101.12కు పెరిగింది. ఇప్పటి వరకు మే 4 తర్వాత నుంచి ఇప్పటి వరకు 29సార్లు ధరలు పెరిగాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు.
 
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌ ధరలు 
 
ఢిల్లీలో పెట్రోల్‌ రూ.97.50.. డీజిల్‌ రూ.88.23
ముంబైలో పెట్రోల్‌ రూ.103.63.. డీజిల్‌ రూ.95.72
హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.101.33.. డీజిల్‌ రూ.96.17
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.97.38, డీజిల్‌ రూ.91.08
చెన్నైలో పెట్రోల్‌ రూ.98.65, డీజిల్‌ రూ.92.83
విజయవాడలో పెట్రోల్‌ రూ.103.27, డీజిల్‌ రూ.97.53

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments