Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌ళ్లీ పెరిగిన‌ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

Advertiesment
మ‌ళ్లీ పెరిగిన‌ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు
, శనివారం, 8 మే 2021 (15:59 IST)
దేశంలో మ‌ళ్లీ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. వ‌రుస‌గా నాలుగో రోజూ పెట్రో ధ‌ర‌ల‌ను పెంచుతూ దేశీయ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. 
 
దీంతో దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో లీట‌ర్‌ పెట్రోల్‌పై 25-28 పైస‌లు, డీజిల్‌పై 30-33 పైస‌ల వ‌ర‌కు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.91.27, డీజిల్‌ రూ.81.73కు చేరింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.97.61, డీజిల్‌ రూ.88.82, చెన్నైలో పెట్రోల్‌ రూ.93.15, డీజిల్‌ రూ.86.65, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.41, డీజిల్‌ రూ.84.57కు చేరాయి.
 
 బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.30, డీజిల్‌ రూ.86.64కు, హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.86, డీజిల్‌ రూ.89.11కు, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.65, డీజిల్‌ రూ.90.25గా ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధ‌మైన ప‌న్నులు విధిస్తుండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి.
 
 ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో సుమారు రెండు నెల‌ల‌పాటు దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. ఎన్నిక‌లు ముగియ‌డంతో గ‌త నాలుగు రోజులుగా ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. దీంతో ఢిల్లీలో నాలుగు రోజుల్లో పెట్రోల్ పై 82 పైస‌లు, డీజిల్‌పై రూ.1 పెరిగాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేకను చంపేందుకు వచ్చిన సింహాన్ని అడ్డుకున్న యువకుడ్ని పొట్టనబెట్టుకుంది