ఇటీవల కాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులకు బతుకు పెను భారంగా మారింది. దీనికి తోడు కరోనా మహమ్మారితో పనులు దొరక్క విలవిలలాడుతున్నారు. గత ఏడాది నిత్యావసరాలు కొంత మేర అందుబాటులో ఉండగా ఈ ఏడు రోజురోజుకు పెరిగిపోతూ కొనలేని పరిస్థితి నెలకొంది.
గత ఏడాది కందిపప్పు రూ. 80 ఉండగా ప్రస్తుతం రూ. 120 ఉంది. సనఫ్లవర్ ఆయిల్ గత ఏడాది రూ. 100 ఉండగా ప్రస్తుతం రూ. 165, వేరుశనగ విత్తనాలు గతంలో రూ. 80 ఉండగా రూ. 120, ఎండు మిరపకాయలు రూ. 100 ఉండగా ప్రస్తుతం రూ. 180, మినపప్పు గతంలో రూ. 80 ఉండగా ప్రస్తుతం రూ. 120.
పెసలు గతంలో రూ. 60 ఉండగా ప్రస్తుతం రూ. 120, బెల్లం గతంలో రూ. 40 ఉండగా ప్రస్తుతం రూ. 55, శనగపప్పు గతంలో రూ. 60 ఉండగా ప్రస్తుతం రూ. 80 ఉన్నాయి. వీటికి తోడు పెట్రోలు డీజల్, గ్యాస్ అను నిత్యం పెరగడం వల్ల వీటి ప్రభావం నిత్యావసరాలపై పడి పేదప్రజల జీవితాలు కడు దుర్భరంగా మారాయి.